calender_icon.png 1 August, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల రక్షణకు సఖి కేంద్రం

31-07-2025 10:31:06 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 6వ డివిజన్ లష్కర్ బజార్ లో సఖి కేంద్రాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సఖి కేంద్రాల ఏర్పాటును చేపట్టింది.

ఇక్కడ మహిళలకు మానసిక, శారీరక, న్యాయ సహాయం ఒకే చోట అందించబడుతుంది. మహిళల హక్కులను కాపాడటానికి ఇది శక్తివంతమైన వేదిక అవుతుంది అని అన్నారు. మహిళలు సఖి కేంద్రాన్ని ధైర్యంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సఖి  కేంద్రంలోని సదుపాయాలను పరిశీలించినారు. సిబ్బందిని అభినందించారు. మహిళల కు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో రాజీ పడదని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో అన్ని విధాలుగా అనుకూల వాతావరణంలో ఏర్పాటు చేయడం శుభపరిణామం అని అన్నారు.