calender_icon.png 1 August, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నక్సలైట్ల ముసుగులో వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్టు

31-07-2025 10:02:13 PM

చిట్యాల సిఐ దగ్గు మల్లేష్ యాదవ్

చిట్యాల,(విజయక్రాంతి): నక్సలైట్ల పేర్లతో వసుళ్ళకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్ పంపినట్లు చిట్యాల సిఐ దగ్గు మాలేష్ యాదవ్ తెలిపారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. రేగొండ మండలంలోని రంగయ్య పల్లి గ్రామానికి చెందిన  పల్లెపాటి గోపాల్ రావు ఇటీవలే మద్యానికి, పేకాటకు బానిసయ్యాడని తెలిపారు.

ఈ క్రమంలో నక్సలైట్ల పేరుతో ఒక లేఖను సృష్టించి చిట్యాల మండలంలోని శాంతినగర్ సమీపంలోని లక్ష్మీనరసింహ రైస్ మిల్ యజమాని శేకరయ్యను బెదిరించడం మొదలుపెట్టాడు. 25 లక్షలు మావోయిస్టు పార్టీకి కి చందాగా ఇవ్వాలని డిమాండ్ చేయసాగాడు. తక్షణమే లక్ష రూపాయలు అందచేయాలని మిగతా డబ్బులను 10 రోజుల్లో ఇవ్వకపోతే చంపివేస్తానని బెదిరించినట్లు వివరించారు.దీంతో రైస్ మిల్ యజమాని శేఖరయ్య  చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడన్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు.మావోయిస్టు ల పేరుతో ఎవరైనా చందాల వసూళ్లకు పాల్పడితే నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకు రావాలని సీఐ కోరారు.