31-07-2025 10:13:48 PM
శంకరంపేట /చేగుంట,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన చిన్న శంకరంపేట్ మండల పరిధిలోని ఖాజాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... ఖాజాపూర్ గిరిజన తండా చెందిన రమేష్, విక్రమ్, సుధాకర్ లు కలిసి తన బైక్ పై మెదక్ వెళుతుండగా, ఖాజాపూర్ గ్రామ శివారులోకి రాగానే, ముందు వెళ్తున్న ట్రాలీ ఆటోను, ఢీ కొనడంతో బైక్ పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరిని రామాయంపేట ఆస్పత్రికి తరలించారు, మిగతా ఇద్దరు విక్రమ్,సుధాకర్, లను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు, ఈ మేరకు చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.