31-07-2025 10:38:41 PM
టిఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శిరసానోళ్ల బాలరాజు
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకల రాజు మాదిగ ఆదేశాల మేరకు టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు శిరసనుల్ల బాలరాజు మాదిగ ఆధ్వర్యంలో టీఎంఎంఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఇమ్మడి ప్రసన్న మాదిగ ను ఎన్నుకోవడం జరిగింది. టిఎంబిసి (తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా జక్కిడి రామన్నచారి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంచి అశోక్, సంయుక్త కార్యదర్శి దొమ్మాటి రవీందర్ లను ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా టి.ఎన్.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ... తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో, మండలాలలో, గ్రామాలలో ఉన్న మాదిగ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి న్యాయం చేయాలని అలాగే వారి అభివృద్ధికి సహకరించడంలో మహిళలు ముందుకు రావాలని కోరారు. అలాగే టిఎమ్ఆర్పిఎస్ అనుబంధ సంస్థల గా టి ఎన్ బి సి లోని పేద వర్గాల అభివృద్ధి పథకంలో నడిపించి వెనుకబడిన బహుజనులను చైతన్యం చేస్తూ నిరుపేద కుటుంబాలను విద్యార్థులను, కార్మికులను చైతన్యం చేస్తూ అభివృద్ధి దిశగా బహుజనులను నడిపించలని వారు కోరారు.