31-07-2025 10:27:40 PM
సిద్దిపేట క్రైమ్: విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సిద్దిపేట టూ టౌన్ ఎస్ఐ ఆసిఫ్ సూచించారు. గురువారం సిద్దిపేటలోని శ్రీ చైతన్య ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్ బ్యాడ్టచ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, ఈవ్ టీజింగ్, ట్రాఫిక్, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే డయల్ 100 లేదా సిద్దిపేట షీ టీమ్ నెంబర్ 8712667434 కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.