31-07-2025 10:19:24 PM
సిద్దిపేట క్రైమ్: రోగికి అత్యవసర సమయంలో రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు ఓ హోంగార్డు. మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అత్యవసరంగా అతడికి శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో బిపాజిటివ్ రక్తం అవసరము ఏర్పడింది. ఈ విషయం తోటి పోలీస్ మిత్రుల ద్వారా తెలుసుకున్న సిద్దిపేట వన్ టౌన్ హోంగార్డు రవి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశాడు. ఈ సందర్భంగా రోగి కుటుంబ సభ్యులు రవికి కృతజ్ఞతలు తెలిపారు.