calender_icon.png 26 October, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి కట్టుబడి పని చేస్తా

26-10-2025 04:34:38 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. ఆదివారం తిర్యాణి మండలం కన్నెపల్లి గ్రామంలో పెరక సంఘం భవనము నిర్మాణానికి  భూమి పూజ చేశారు. ​అంతకుముందు ఆసిఫాబాద్ పట్టణం జనకాపూర్ వైయస్సార్ కాలనీలో పోచమ్మ గుడికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.

ప్రజల పక్షాన ఉండి వారి సంక్షేమానికి పాటుపడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జన్కపూర్ వైస్సార్ కాలనీ వాసులు G.మారుతీ, S.రాజేష్ కుమార్ గణేష్, వినోద్, నవీన్, తిర్యాని మండలం కన్నెపల్లి పెరుక సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యం రాజన్న, రాష్ట్ర నాయకులు చుంచు శ్రీనివాస్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు హనుమండ్ల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.