17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

స్వయం ఉపాధి దిశగా యువత ముందుకురావాలి..

01-11-2025 09:58 PM

జిల్లా కలెక్టర్ రాజర్షి షా..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి అవకాశాలను యువత పూర్తిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్‌ లోని టిటిడిసి భవనంలో నిర్వహించిన ఇందిరమ్మ సెంట్రింగ్ యూనిట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు కలెక్టర్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు.

శిక్షణ పొందిన యువత నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి సాధించాలని సూచించారు. నిర్మాణ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికులను తీర్చిదిద్దడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కష్టపడి నేర్చుకుంటే ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు తప్పక లభిస్తాయని, జిల్లాలో ఇలాంటి మరిన్ని శిక్షణా కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, డిఆర్డిఓ డిపిఎం, ఎపిఎం, న్యాక్ ఏడి స్వప్న రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.