01-11-2025 10:01:00 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): శనివారం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా శనివారం సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ పరిశీలనలో భాగంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి అనుమతించరాదని అధికారులకు సెక్యూరిటీ గార్డ్ కు తెలిపారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లు సంతకం చేశారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట కొత్తగూడెం రెవిన్యూ డివిజనల్ అధికారి డి. మధు, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్, తదితరులు పాల్గొన్నారు.