calender_icon.png 2 February, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటికి నిప్పు

02-02-2026 01:19:23 AM

సీఎం చంద్రబాబు, లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు

ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు

అమరావతి, ఫిబ్రవరి 1: ఏపీ మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్య ల చేశారంటూ టీడీపీ శ్రేణులు ఆదివారం విజయ వాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో  వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి పై దాడి చేశారు. కొంతమంది ఇంటికి నిప్పు పెట్టారు. అయితే ఈ సమయంలో జోగి రమేశ్ ఇంట్లో లేరు. తండ్రి జోగి మోహనరా వు, భార్య శకుంతల దేవి, చిన్న కొడుకు రో హిత్ ఇంట్లో ఉన్నారు. దీంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడ భారీగా చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో ఇంటి మొదట అంత స్తులో మంటలు ఎగిసిపడ్డాయి.

అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బం ది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయ త్నిస్తుండగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని శాంతింపజేసేందుకు చర్యలు చేప ట్టారు. కాగా శనివారం జోగి రమేశ్ ‘కల్తీ మాటలతో టీడీపీ కల్తీగా మారింది. లోకేశ్‌కు చిప్ దెబ్బతింది. బుద్ధి తక్కువ రాజకీయాలు మానుకోవాలి. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని నాశనం చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ అంటూ చేసిన ప్రచారాన్ని సిట్ నిగ్గు తేల్చింది. టీడీపీ నేతలకు బుద్ధిని ప్రసాదించాలని పూజలు చేశా’ అని మాట్లడారు.