calender_icon.png 2 February, 2026 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీటీడీ ఈవో అనిల్‌పై బదిలీ వేటు

02-02-2026 01:26:28 AM

సీఎం ప్రధాన కార్యదర్శి రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు

అమరావతి, ఫిబ్రవరి 1: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమా ర్ సింఘాల్‌పై బ దిలీ వేటు పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సింఘాల్ స్థానంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా సింఘాల్ బదిలీకి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసే కారణమని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ పని చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా విషయంలో అప్పటి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో పాటుగా అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్, చీప్ ఎకౌంట్స్ ఆఫీసర్ బాలాజీల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ సీబీఐ సిట్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో సర్కార్ వెంటనే అనిల్‌కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు పడింది. కాగా అనిల్ కుమార్ సింఘాల్‌ను తక్షణమే సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్ కుమార్ సిం ఘాల్, 2017 మే నుంచి 2020 అక్టోబర్ వరకు తొలిసారి టీటీడీ ఈవోగా సేవలందించారు. అనంతరం గతేడాది సెప్టెంబరులో రెండోసారి ఈ పదవిని చేపట్టారు. కేవలం ౫నెలల్లోనే ఆయన బదిలీ అయ్యారు.