17 March, 2026 | 6:34 PM

Districts

article_56637668.webp
గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు(Telangana Budget Session) ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla speech) ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి(BRS MLA Prashanth Reddy) మాట్లాడుతూ... ఇచ్చిన ఆరు హామీలను కనీసం గవర్నర్ ప్రసంగంలో కూడా పెట్టలేదని ఆరోపించారు. తెలంగాణ మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

16-03-2026

article_81788924.webp
రాజ్యసభ ఎన్నికలు.. రాష్ట్రంలో 3 నామినేషన్లు దాఖలు

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పక్రియ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యసభ(Rajya Sabha election nomination) ఎన్నికలకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ తరుఫున వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మనుసింఘ్వీ నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికకు ఇతర పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు. స్వతంత్ర అభ్యర్థి సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. స్క్రూటినీలో స్వంతంత్ర అభ్యర్థి నామినేషన్ ఆర్ వో తిరస్కరించే అవకాశముంది.

05-03-2026

article_38751898.webp
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అస్వస్థత

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి(Tatiparthi Jeevan Reddy) ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ఆహారం తీసుకున్న జీవన్ రెడ్డికి గురువారం రాత్రి వాంతులు, విరేచనాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబీకులు తెలిపారు. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలపై జీవన్ రెడ్డి టీ కాంగ్రెస్ నేతలపై కోపంగా ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి 20 టికెట్లు, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంజయ్ వర్గానికి 30 టికెట్లు ఇవ్వండపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

20-02-2026