పోలీస్ పరేడ్ పాల్గొన్న జిల్లా ఎస్పీ
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్‌లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల(Nirmal SP Janaki Sharmila) పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులకు క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం ఎంతో ముఖ్యమన్నారు.
చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. విధి నిర్వహణతో పాటు కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తూ మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు మల్లేష్, గోవర్ధన్ రెడ్డి, కృష్ణ, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.