గ్రీన్ గ్రోవ్ స్కూల్స్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

07-11-2026 | 07:51pm

విద్యార్థుల సృజనాత్మకతతో పాఠశాలలో పండుగ శోభ

చౌటుప్పల్: గ్రీన్ గ్రోవ్ స్కూల్స్‌(Green Grove Schools )లో దీపావళి పండుగను పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని పండుగ సంబరాలను జరుపుకున్నారు. పాఠశాల ప్రాంగణాన్ని అందమైన దీపాలు, రంగురంగుల అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. విద్యార్థుల(Students) సృజనాత్మకత, కళాత్మకతతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థుల ప్రతిభను, వేడుకల ఏర్పాట్లను చూసిన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయ బృందాన్ని పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ సాదిపల్లి లక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీపావళి దీపాల మాదిరిగా విద్యార్థుల జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలగాలని, విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి గ్రీన్ గ్రోవ్ స్కూల్స్ యాజమాన్యం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది.

మరిన్ని వార్తలు