ఆటపాటలతో ఘనంగా చిల్డ్రన్స్ సండే వేడుకలు
చిన్నారులకు ఆధ్యాత్మిక సందేశం అందించిన పాస్టర్ స్టీవెన్
బోధన్, నవంబర్ 15 (విజయక్రాంతి): బోధన్ మండలం(Bodhan Mandal) శక్కర్ నగర్లోని CSI చర్చిలో చిల్డ్రన్స్ సండే(Children's Sunday) (సండే స్కూల్ సండే) వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చర్చి పాస్టర్ రెవ. ప్రభాకర్(Church Pastor Rev. Prabhakar) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
ఈ సందర్భంగా రెవ. స్టీవెన్ పాస్టర్ చిన్నారులను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగిస్తూ, మంచి నడవడిక, క్రమశిక్షణ(Discipline), ప్రేమ, దైవభక్తి వంటి విలువలను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని సందేశం అందించారు. ఆధ్యాత్మిక విలువలతో కూడిన బోధనలు పిల్లల జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెవ. జ్యోతి రాజ్, రెవ. వరుణ్, చర్చి కమిటీ పెద్దలు ఎడ్వర్డ్, జ్యోతి రాజ్, పుష్పరాజ్, సెమిన్స్, బెనహార్, టీనా, సండే స్కూల్ ఉపాధ్యాయులు, చర్చి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల ఆటపాటలు, ప్రత్యేక కార్యక్రమాలతో వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.