గాంధీ విగ్రహం ధ్వంసం
మంథని,(విజయక్రాంతి): మంథని మండలం గుంజపడుగు గ్రామం(Gunjapadu Village)లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని(Mahatma Gandhi Statue) గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దేశానికి అహింసా మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం(Gandhi Statue Vandalized) చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విగ్రహం ధ్వంసం వెనుక ఎవరున్నారు. ఏ కారణంతో ఈ చర్యకు పాల్పడ్డారు. అనే అంశాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు.