మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

16-11-2026 | 05:27pm

రామగిరి, నవంబర్ 16(విజయ క్రాంతి): రామగిరి మండల పరిధిలోని బుధవారపేట (రామయపల్లి) గ్రామంలో(Budhavarapeta Village) రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. 

గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య తల్లి ఆరెల్లి గట్టుమల్లు ఇటీవల మృతి చెందగా, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన దాడి శంకరయ్య ఇటీవల మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరిన్ని వార్తలు