రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ జర్నలిస్టు
పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి
ముత్తారం, నవంబర్ 03(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూరు ప్రధాన రహదారి(Pannuru Main Road) పై ఇటీవల పంది అడ్డం రావడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ముత్తారం మండలంలోని సీనియర్ జర్నలిస్టు ఏలువాక కుమార్ స్వామిని మంగళంవారం కాల్వ శ్రీరాంపూర్ వంగల తిరుపతి రెడ్డి సోమవారం రాత్రి ఇంటికి వేళ్లి పరామర్శించారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గాయపడ్డ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సమయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తిరుపతి రెడ్డి భరోసా ఇచ్చారు.