ఆపదలో ఉన్న వారికి అండగా వాకర్స్ అసోసియేషన్

15-11-2026 | 01:14pm

సుల్తానాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవతా విలువలను చాటేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ (Walkers Association) సభ్యులు ముందుకొచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ప్రమాదాల బారినపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవాలనే సంకల్పంతో తమ వంతు సహాయం అందించారు. సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్‌కు చెందిన మంగళ రాము క్యాన్సర్ వ్యాధితో (Cancer Treatment) బాధపడుతుండగా, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వాలీబాల్ క్రీడాకారుడు, హర్ష హైస్కూల్ కరస్పాండెంట్ ఇక్బాల్ గాయపడ్డారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న అసోసియేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి ఇద్దరికీ కలిపి రూ.16 వేల ఆర్థిక సహాయం (Financial Assistance) అందజేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. సమాజంలో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. అనారోగ్యం, ప్రమాదాల వంటి ఊహించని పరిస్థితుల్లో బాధిత కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాయని, అలాంటి సమయంలో చిన్నపాటి ఆర్థిక సహాయం కూడా వారికి ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ అవసరమైన వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు వాకర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సమాజంలో మానవత్వం, పరస్పర సహకారం, సేవా దృక్పథం పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చొప్పరి సుమన్, ప్రధాన కార్యదర్శి నిట్టూరి శ్రీనివాస్, కోశాధికారి కామిని శ్రీకాంత్, సభ్యులు కొమురవెల్లి భాస్కర్, పల్ల సురేష్, రాజేంద్రప్రసాద్, ఉల్లంగుల శ్రీనివాస్, ఎనగందుల మల్లేశం, కోడెం అజయ్, వల్స మల్లేశం, పైడ ఆంజనేయులు, కట్ల రాజమౌళి, సుంక వేణు, మహమ్మద్ ఖాసీం, దూడం లింగమూర్తి, శ్రీగిరి సుధాకర్, కామిని వెంకటేశం, రామకృష్ణ, దేవరకొండ ప్రకాష్, రాఘవులు, జగన్, గెల్లు మధుకర్, బూడిద స్వామి, ఎలగందుల ఎల్లయ్య, కోయ్యడ సంతోష్, ఎం.డి. ముస్తఫా, సిరిపురం రమేశ్, రాజు, తిరుపతి, సలకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు