కాంగ్రెస్ పాలనలో కొనలేం... తినలేం

03-11-2026 | 11:12pm

- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

- నిత్యావసరాల ధరల పెరుగుదలపై బీఆర్ఎస్ ఆందోళన 

ఎల్బీనగర్, నవంబర్ ‌3: కాంగ్రెస్ తెచ్చిన కరువులో సామాన్య ప్రజలు ఏమి కొనలేని... తినలేని పరిస్థితి ఉన్నదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) అన్నారు. నిత్యావసర ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎల్బీనగర్‌లో బీఆర్ఎస్ మహిళా విభాగం మౌన ప్రదర్శన నిర్వహించారు.  ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని నిరసిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ  ఎన్టీఆర్ మార్కెట్ నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ర్యాలీలో  2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలు, 2026లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలతో కూడిన పట్టికను ప్రదర్శించారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని మహిళా నాయకురాలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే మహిళలు పెరుగుతున్న ధరల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.‌ ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు