రైతుకు గిట్టుబాటు - ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం

10-11-2026 | 04:49pm

కోరేం సింగిల్ విండో చైర్మన్ వన్నెల మమత రమణారెడ్డి

బోయినపల్లి: రైతులకు(Farmers') గిట్టుబాటు ధర(Remunerative price) చెల్లింపు తో పాటు, రైతుల(Farmers') అభ్యున్నతి కోసమే గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలు(Grain procurement centers) ఏర్పాటు చేస్తున్నట్లు కోరేం సింగిల్ విండో చైర్మన్ వన్నెల మమత రమణారెడ్డి చెప్పారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) బోయినపల్లి మండలం కోరెం సింగిల్ విండో పరిధిలోని గ్రామాల్లో ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

అనంతరం రైతులతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ మమత రమణారెడ్డి మాట్లాడుతూ రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్విని చేసుకొని దాన్యం వికరించుకోవాలని కోరారు. దళారులకు విక్రయించి మోసపోవద్దని కోరారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువిన్ యాదవ్,   కాంగ్రెస్ సీనియర్ నాయకులు వన్నెల రమణారెడ్డి,సర్పంచులు  అంజయ్య, మడ్లపల్లి తులసి గంగయ్య, జంపుక మాధవి ఆనంద్, రైతులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు