న ఘర్‌కా.. న ఘాట్‌కా!

14-10-2026 | 05:40am

మెట్రో ఫేజ్-2 ప్రణాళిక అమలు

డోలాయమానం

ఇప్పటికీ అందని రూ.13,600 కోట్ల రుణం

ఎల్ అండ్ టీ నుంచి ఎన్‌వోసీ తీసుకోవడంలో కాలయాపన

ప్రభుత్వం మెడకు ఆర్థిక భారం

* హైదరాబాద్ ముఖచిత్రానికి.. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కీలకమైన పాత్రధారిగా చెప్పుకుంటున్న హైదరాబాద్ మెట్రో పరిస్థితి న ఘర్‌కా.. న ఘాట్‌కా అన్నట్లుగా తయారైంది. అటు ప్రైవేటు సంస్థ (ఎల్‌అండ్‌టీ) చేతిలో లేకుండా, ఇటు పూర్తిగా ప్రభుత్వం సమర్థవంతంగా సేవలు అందించలేని పరిస్థితిలో రెంటికీ చెడ్డ రేవడిలా మెట్రో ఊగిసలాడుతోంది.

మెట్రో ఫేజ్‌ధి  హైదరాబాద్ చిత్రపటం మారుతుందని భావించినప్పటికీ.. దాదాపు ఏడాది నుంచి ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా కొట్టుమిట్టాడుతోంది. దీనికి ప్రధాన కారణం.. ప్రభుత్వం హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం, భారీగా రుణం కోసం ఎదురుచూస్తూ నెలలుగా కాలం గడిపేస్తుండటమేనని రాజకీయ విశ్లేషకులు గట్టిగా వాదిస్తున్నారు.

అక్టోబర్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోను(Hyderabad Metro) లార్సన్ అండ్ టుబ్రో(Larsen & Toubro) (ఎల్ అండ్ టీ) నుంచి పూర్తిగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ కి ఉన్న సుమారు రూ.7 వేల కోట్ల విలువైన భాగస్వామ్యాన్ని, అలాగే ఎల్ అండ్ టీ తెచ్చిన సుమారు రూ. 13,000 కోట్ల రుణాలను తామే టేకోవర్ చేయనున్నట్టు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

మెట్రో రెండో దశను చేపట్టాలంటే, ప్రైవేటు సంస్థల(Private companies) పరిధిలో మెట్రో ఉండకూడదని కేంద్రం విధించిన నిబంధనల నేపథ్యంలో.. క్యాబినెట్ సబ్ కమిటీ, సెక్రెటరీల కమిటీ, ఆర్థిక రంగ నిపుణుల(Financial sector experts) సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ఎల్ అండ్ టీతో చర్చలు జరిపి రూ. 15,000 కోట్ల మొత్తాన్ని (ఎల్ అండ్ టీ షేర్లు, రుణాలు మొత్తం కలిపి) ఇచ్చి మెట్రో ఫేజ్-1ను ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

రాని రుణం..

ఎల్ అండ్ టీకి చెల్లించడానికి వీలుగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లి(Indian Railway Finance Corporation Ltd.) (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి సుమారు రూ. 13,600 కోట్లను రుణంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే రైల్వే శాఖ నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రుణం ఆగిపోయింది. దీనితో ఇతర ప్రత్యామ్నాయాల వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) (ఎస్‌బీఐ) నుంచి రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోం ది. అదికూడా కనుచూపు మేరలో ఫలితం వస్తుందా అనేది నమ్మకశక్యంగా లేదు. దీనితో గడిచిన సంవత్సర కాలంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 అటు ఎల్‌అండ్‌టీకి చెందకుండా.. ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో  సేవలు మెరుగుపర్చకుండా సాగుతున్నాయనే విమర్శలను కూడగట్టుకుంటున్నారు.

ఫేజ్ ఎంతో ముఖ్యం..

ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు ప్రకటించిన మెట్రో ఫేజ్-2 తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చేదిగా.. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్రను పోషించే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టంగానే చెప్పింది. అయితే మెట్రో ఫేజ్-1 ప్రైవేటు చేతిలో ఉండటం.. మెట్రో ఫేజ్-2 ప్రభుత్వం చేపట్టాలని అనుకోవడంతో.. మొదటి ఫేజ్‌కూడా పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉంటేనే ఫేజ్-2కు కేంద్ర ప్రభుత్వం సహాయం అందుతుందని స్పష్టంచేసింది.

ఈనేపథ్యంలోనే ఎల్ అండ్ టీ నుంచి ఫేజ్1 మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అలాగే.. ఫ్యూచర్ సిటీ, శంషాబాద్ ఏయిర్‌పోర్ట్‌కు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్‌కు ఫేజ్-2 మెట్రో ఎంతో కీలకం. దీనితోపాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్ బాధల నుంచి ఉపశమ నం పొందాలన్నా.. కాలుష్యాన్ని తగ్గించాల న్నా ఫేజ్-2 మెట్రో అత్యవసరం.

రాష్ట్ర రాజధాని ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగ అభివృ ద్ధి, నగర శివారు ప్రాంతం అభివృద్ధి మొత్తం ఇప్పుడు మెట్రో ఫేజ్-2తో ముడిపడి ఉంది. మెట్రో ఫేజ్-2 చేపట్టాలంటే.. కనీసం రూ. 24,000 కోట్లు కావాలి. ప్రస్తుతం ఫేజ్-1ను స్వాధీనం చేసుకోవడానికి ఎల్ అండ్ టీకి ఇవ్వడానికే రూ. 13,600 కోట్ల కోసం నానా తిప్పలు పడుతున్న ప్రభుత్వం.. ఫేజ్-2 కో సం రూ. 24 వేల కోట్లను సమీకరించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సాయం అందిస్తుందనే దానిపైకూడా స్పష్టత లేదు.

మందగించిన సేవలు..

మెట్రో-౨ ఫేజ్ డోలాయమానంలో ఉండగా, ఇటు మెట్రో ఫేజ్-1 సేవలు మందగించినట్టుగా ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు.అసలు ఫేజ్‌h ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో ఉందా.. లేక అనుకున్న గడువులోగా తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకపోవడంతో.. ఎల్‌అండ్‌టీ ఆధీనంలో ఉందా అనేది తేలడం లేదు. మెట్రో టైమింగ్స్, ట్రిప్‌లు పెంచడం, మరిన్ని బోగీలు అమర్చడం, మెట్రో స్టేషన్లలో వసతుల కల్పన, నిర్వహణ, మెట్రో స్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను కల్పించడం లాంటి అనేక వసతులను మెరు గు పర్చాల్సి ఉంది. కానీ ఇప్పుడు మెట్రో అటో అడుగు.. ఇటో అడుగు అన్న చందంగా.. మెరుగుపడాల్సిన సేవలు కాస్తా.. మందగిస్తున్నాయనే విమర్శలను కూడగట్టుకోవాల్సి వస్తోంది.

ఎన్‌వోసీ ఎప్పుడు.. 

వాస్తవానికి ప్రభుత్వం, ఎల్ అండ్ టీ మధ్యన టేకోవర్ ఒప్పందం జరిగినప్పుడే ఎన్‌వోసీ (నిరభ్యంతర పత్రం) తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఎందుకనో తాత్సారం చేసిందని వినపడుతోంది. ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించిన తరువాతనే ఎన్‌వోసీ ఇస్తామని సదరు ప్రైవేటు కంపెనీకూడా  షర తు విధించినట్టు సమాచారం. ఏదైతేనేమీ.. ఇప్పటికీ ఎన్‌వోసీ రాలేదు. దీనితో అటు ప్రభుత్వం ముందడుగు వేయాలన్నాకూడా ఎన్‌వోసీ రాకపోవడమనేది అడ్డంకిగా మారినట్టుగా సమాచారం.

ఎన్‌వోసీ ఉంటే ఆర్థిక వనరుల సేకరణ వేగంగా జరిగేదని నిపుణులు అంటున్నారు. నిజానికి ఎల్‌అండ్‌టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో అగ్రిమెంట్ జరిగినప్పుడే ఎన్‌వోసీ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఎందుక నో ఈ విషయంపై అలసత్వం వహించింది. అధికారులు ఆ దిశగా దృష్టి సారించలేదు. దీనితో ఎన్‌వోసీ విషయం తేలకపోవడంతో.. ఫేజ్-2 పనులను చేపట్టడానికి అడ్డంకిగా మారుతోందని సమాచారం. ఇప్పుడు మధ్యలో ప్రభుత్వం ఇరుక్కుపోయిందనే వాదనా వినపడుతోంది.

సర్కారుపైనే ఆర్థిక భారం.. 

రెంటికి చెడిన రేవడిలా తయారైన మెట్రో ఫేజ్-1 కారణంగా.. మెట్రో ఫేజ్-2 ఆలస్యం అవుతోంది. వెరసి ప్రభుత్వంపైనే భారం పడుతోంది. ప్రతి సంవత్సరం సుమారు రూ. 650 నుంచి రూ. 700 కోట్ల వరకు మెట్రోకు నష్టం వస్తున్నట్టు గణాంకాలను బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వం టేకోవర్ విషయంలో లోపం, ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి రుణం రాకపోవడం, మెట్రో ఫేజ్-2 ఆలస్యం కావడం ఇలా అనేక కారణాలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. దీనితో వేగంగా అభివృద్ధి చెందాల్సిన ఫ్యూచర్ సిటీ, ఆర్థికాభివృద్ధిపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అంతిమంగా వెరసి.. ప్రభుత్వంపైనే ఆర్థిక భారం పడుతుందని, అదికాస్తా రూ. వేల కోట్లు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఫేజ్-1లో ప్రయాణికులకు సేవలను విస్తరించకుండా.. ఇటు ఆర్థిక వనరుల సేకరణలో వెనుకబడటం, నష్టాల నుంచి బయటపడే ప్రణాళిక లేకపోవడం, ఫేజ్-2 పనులు ప్రారంభించకపోవడం వల్ల  ప్రభుత్వం మరింత ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించాల్సి ఉందని, ఎల్ అండ్ టీ నుంచి ఎన్‌వోసీ తీసుకుని, ఆర్థిక వనరులను సమీకరించుకుని వేగంగా ఫేజ్-2ను పూర్తిచేస్తే.. జరిగే అభివృద్ధితో ఆర్థికంగానూ లాభదాయకంగా మారుతుందని, తద్వారా ఆర్థిక భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వారంటున్నారు. 

మరిన్ని వార్తలు