దేశంలో అరాచకం సృష్టించేందుకు ఇండీ కూటమి కుట్ర

14-10-2026 | 05:35am

కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఈసీ, సీజేఐదా?

ప్రజాస్వామ్యం పేరుతో దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారు

మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

అక్టోబర్ 13  (విజయక్రాంతి): కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఈసీ, సీజే ఐదా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ప్రశ్నించారు. గత వారం రోజులుగా కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రప క్షాలు ఢిల్లీలో నిరసనల పేరిట చేస్తున్న డ్రామాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, దేశంలో అరాచకం సృష్టించేందుకు.. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్ష పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు.

వీరంతా కలిసి దేశ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వా మ్యం పేరుతో.. పరమ అసహ్యంగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) అథమ స్థాయికి దిగ జారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో లోక్‌సభ స్పీకర్ రాజీనామా చేయాలని పార్లమెంటులో హైడ్రామా నడి పి, నవ్వుల పాలయ్యారని, ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Chief Election Commissioner Gyanesh Kumar) రాజీనామా అన్నారని.. ఇప్పుడేమో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ దోబల్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్.. తమ టార్గెట్ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడు తున్నారని తెలిపారు.

మంగళవారం ఢిల్లీలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. మోదీ సర్కారును కూలదోయడమే టార్గెట్ అంటున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీగా అలా అనుకో వడంలో తప్పు లేదు.. కానీ దాని కోసం నైతిక విలువను వదిలిపెట్టి.. దేశంలో ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసే లా వ్యవహరించడం దారుణమన్నారు.

దేశం సోనియా ఫ్యామిలీ ప్రాపర్టీనా?

ఇప్పుడు తమకు అనుకూలంగా తీర్పులు రాలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ ర్తి కూడా గద్దెదిగాలని కాంగ్రెస్ అంటోందన్నారు. ప్రజల మద్దతు లేకపోవడంతో మీరు ఎన్నికల్లో ఓడిపోతున్నారు.. దానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలా బాధ్యత వహిస్తారని నిలదీశారు. అనుకూలంగా ఆదేశాలను ఇవ్వలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను బెదిరి స్తున్నారని, ఆయనపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తున్నారని, వేలాది మంది ర్యాలీగా వెళ్లి ఒత్తిడి తీసుకురావడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారని ఫైరయ్యారు.

ఎన్నిక ల్లో ఓడిపోతున్నారని.. ప్రధానిని, హోంమంత్రిని బెదిరిస్తున్నారని, దేశం ఏమైనా సోనియా కుటుంబం ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకునే హక్కు, అధికారం 140 కోట్ల ప్రజలకు ఉందన్నారు. తమకు 200 మంది అధికారులు టచ్‌లో ఉన్నారని, వారంత ప్రధాని మోదీ గద్దె దిగాలని కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ.. ఇలా మాట్లాడి ఎవర్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు.  

మృతుల ఓట్లు తొలగించొద్దా..

సర్ ద్వారా 2.8 కోట్ల మంది చనిపోయినట్లు తేలిందని, చనిపోయిన వారి ఓట్లను ఉంచితే ఎవరు వచ్చి ఓటు వేస్తారో చెప్పాలన్నారు. ఆ ఓట్లను తొలగించాల్సిన బాధ్యత అధికారులది, పార్టీలది కాదా? 6.3 కోట్ల మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని, వారు ఉంటున్న ప్రాంతంలోనే ఓటు నమో దు చేసుకునే అవకాశం ఇచ్చిందన్నారు. కోటి మందికి రెండు చోట్ల ఓట్లున్నాయని, వారందరికీ రెండు ఓట్లు కొనసాగించాలా? రాహుల్ గాంధీ, ధర్నాలు చేస్తున్న అపరిపక్వ నేతలు సమాధానం చెప్పాలన్నారు.

3 కోట్ల ఓట్లకు సంబంధించి.. అసలు వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదన్నారు. ఢిల్లీలో ఊరేగింపు లు చేస్తే ఓటు రాదని, ఓట్లు పోయిన వారు ఎంతమంది మీ ధర్నాల్లో పాల్గొన్నారో  చూపించగలరా? అని నిలదీశారు. ప్రజల సమస్యలపై పోరాడే సత్తాలేక, నరేంద్రమోదీ చేసే మంచి పనులను ఎత్తిచూపలేక.. ఏం చేయాలో అర్థం కాక.. ఇలాంటి పనికిమాలిన ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

బ్యాలెట్‌తోనూ ఓటమినే..

ఈవీఎంలమీద, సర్ మీద బురదజల్లుతున్న కాంగ్రెస్ పార్టీ.. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటీవల బ్యాలెట్ పేపర్ మీద జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు, జ్ఞానేష్ కుమార్‌కు, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధం లేదు కదా? ఎందుకు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగవుతోంది? గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందుతోందని, దీనికి కూడా సీఈసీ, సీజేఐయే కారణమని చెబుతారా? అన్నారు.

2014, 2019, 2024లో ఎస్‌ఐఆర్ లేదు కదా అప్పుడు మీరెందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. తమిళనాడు, కేరళంలో సర్ చాలా ఉపయోగపడిందని, బోగస్ ఓటర్లను తొలగించారని, ఎన్నికల్లో తాము గెలిచేందుకు దోహదపడిందని రమేశ్ చెన్నితల చెప్పారన్నారు. రాహుల్ గాంధీ వ్యవహారం, పార్టీ తీరు, అవినీతిని ప్రజలు నచ్చడం లేదని, మన్మోహన్ సింగ్‌ని, పీవీ నర్సిహారావు, అంబేద్కర్, జగ్జీవన్ రాం, ఎన్టీ రామారావుకు కాం గ్రెస్ చేసిన అవమానాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని.. అందుకే ప్రజలు మీకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారన్నారు.

ఢిల్లీని వారం రోజులుగా కాంగ్రెస్ దాని జేబు సంస్థ అయిన సీజేపీ కలిసి జామ్ చేశాయని, దసరా, దీపావళి, నవరాత్రుల సీజన్ సమయంలో పండుగ వస్తువులు కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. ఢిల్లీ మార్కెట్ దెబ్బతిన్నదని, చిన్న చిన్న దు కాణదారులు మొరపెట్టుకుంటున్నారని తెలిపారు. ఆందోళనలకు జంతర్ మం తర్ వేదికను మార్చాలని వేడుకున్నారని, ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా ఢిల్లీ ప్రజ ల రోజువారీ జీవనాన్ని అస్తవ్యస్తం చేశారన్నారు. 

రాహుల్‌లాగే రేవంత్.. 

రాహుల్ లాగే సీఎం రేవంత్‌కు కూ డా ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. రాహుల్ గాంధీ గజం ఎగిరితే.. నేను ౨ గజాలు ఎగురుతానంటూ రేవంత్ ఎగిరెగిరి పడుతున్నా రని ఎద్దేవా చేశారు. పేదల ఓట్లు, ఆదివాసీల ఓట్లు, దళితుల, మైనారిటీల ఓట్లు తీసేస్తున్నారంటూ రేవంత్.. తప్పు డు ప్రచారం చేస్తున్నారన్నారు. రాముడు--శివుడు అని, మేము రాముడు- వాళ్లు రావణుడు అం టున్నారని, మీకు బంగ్లాదేశ్, అమెరికా, ఇటలీ దేవుళ్ల పేర్లు సెట్ అవుతాయని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో రైతులు నీళ్లులేక, పరిశ్రమ లు, ప్రజలు కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతుంటే.. వారానిక ఓసారి ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీని పొగిడి వెళ్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని, ప్రెగ్నెం ట్ జర్నలిస్టును నెట్టేయడంతో ఆమె ఆస్పత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం శివకుమార్‌ను నెట్టివేసి... కర్ణాటక ప్రజల ఆత్మ గౌరవం కాంగ్రెస్ కాళ్ల మీద పడేశారన్నా రు. కాంగ్రెస్ కార్యకర్తను పిడిగుద్దులు కురిపిస్తుం టే ప్రియాంక గాంధీ నవ్వుతున్నారన్నారు. ఓ మహిళా పోలీసు అధి కారిని కూడా ప్రియాంక గాంధీ మోచేతితో కడుపు లో గుద్దిందన్నారు.

మరిన్ని వార్తలు