నాగలిగిద్ద మండలంలో ఘనంగా దీపావళి వేడుకలు

09-11-2026 | 07:02pm

నాగలిగిద్ద, నవంబర్ 9 (విజయక్రాంతి): నాగలిగిద్ద మండలంలోని(Nagalgidda Mandal) అన్ని గ్రామాల్లో దీపావళి పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇళ్లను దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అలంకార్ వన్ గ్రామ్ గోల్డ్ షాప్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ నజీబ్ హాజరయ్యారు. షాప్ యజమాని అంజిరెడ్డి వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, నాయకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు