రైతులతో రెవెన్యూ రీ-సర్వే అవగాహన గ్రామ సభ
తహసిల్దార్ ఎం పరమేశం
గుమ్మడిదల: ప్రభుత్వం ఆధునిక సాంకేతికత డ్రోన్ రోవర్ తో రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే చేపడుతోందనీ ముందుగా ఐదు గ్రామాల్లో పైలట్ సర్వే విజయవంతంగా పూర్తయిందనీ తహసిల్దార్ ఏం పరమేశం అన్నారం గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామం నాగిరెడ్డిగూడెం గ్రామ శివారు సహా ఎంపిక చేసినట్లు తెలిపారు ఇది తెలంగాణ సర్వే & సరిహద్దుల చట్టం,1923 ప్రకారం జరుగుతుందన్నారు రీ-సర్వే ప్రతి భూమికి ఖచ్చితమైన హద్దులు, భూ-సూచిత పటాలు వస్తాయన్నారు. శాశ్వత డిజిటల్ భూ రికార్డులు తయారవుతున్నాయని అన్నారు.
హద్దు తగాదాలు, రికార్డు లోపాలు లేకుండా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అన్నారు ప్రతి భూ ఖండానికి శాశ్వత భూధార్ నంబర్ వస్తుందను తెలిపారు. సర్వే నోటిఫికేషన్ ప్రకారం, హద్దులు చూపడానికి ఆసక్తిగల వారందరికీ నోటీసు ఇస్తామన్నారు. సర్వే బృందం డ్రోన్/రోవర్‌తో కొలతలు తీసుకుంటుందను వివాదం లేని హద్దులను నమోదు చేస్తారనీ వివాదం ఉంటే సర్వే అధికారి విచారించి కారణాలతో నిర్ణయిస్తారన్నారు నిర్ణయంపై అభ్యంతరం ఉంటే నోటీసు అందిన 60 రోజుల్లో అప్పీలు చేయవచ్చునీ సర్వే పూర్తయ్యాక గెజిట్ నోటిఫికేషన్ ఈయన ఉన్నట్లు తెలిపారు.
దాని కాపీని గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డ్ పై ప్రదర్శిస్తారన్నారు. రైతులు చేయాల్సినవి సర్వే రోజున స్వయంగా లేదా ప్రతినిధి ద్వారా పొలం వద్ద ఉండి, హద్దులు చూపంలని పాస్‌బుక్, పహాణీ, రిజిస్టర్డ్ దస్తావేజులు, ఇతర ఆధారాలు సిద్ధంగా ఉంచుకోంవలన్నారు. పక్క రైతులతో సహకరించంలని హద్దు తగాదాలను ముందే మాట్లాడి పరిష్కరించుకోంవలన్నారు. సర్వే రాళ్లు గుర్తులను తొలగించడం లాంటివి చేయకూడదని సూచించారు.
సర్వే బృందాన్నికి అన్ని విధాల సహకరించాలని రైతులను కోరారు. పంటలు ముళ్ల కంచెలు అడ్డుగా ఉంటే తొలగించుకోవాలన్నారు. సర్వే తర్వాత ఆర్ఓఆర్ నవీకరణ భూ భారతి చట్టం, 2025 సర్వే పూర్తయిన గ్రామంలో కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ తయారు చేయడం చట్టపరమైన నిబంధనలకు లోబడి పనులు జరగనున్నాయన్నారు. కార్యక్రమంలో సర్వే డిపార్ట్మెంట్ ఏడి సంబంధిత అధికారులు సర్పంచ్ సూరారం మంజుల సత్తయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.