సమతుల్య ఆహారంపై అవగాహన
07-10-2026 | 08:18pm
బెజ్జంకి, అక్టోబర్ 7: బెజ్జంకి మండలం(Bejjanki Mandal) వడ్లూరు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ పులి రమేష్ గౌడ్ పాల్గొన్నారు. సూపర్‌వైజర్ నాగరాణి, అంగన్‌వాడీ టీచర్లు సరోజన, మనెమ్మ, ఉప సర్పంచ్ మరియా, ప్రధానోపాధ్యాయులు, ఆశా వర్కర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషకాహారం, తల్లి–బిడ్డల ఆరోగ్యం, పరిశుభ్రత, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించారు.