కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బొయిని ప్రశాంత్

07-10-2026 | 08:17pm

బెజ్జంకి, అక్టోబర్ 7: బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గుగ్గిళ్ల గ్రామానికి చెందిన బొయిని ప్రశాంత్ నియమితులయ్యారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తప్పేట శంకర్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా బొయిని ప్రశాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Kavvampally Satyanarayana), సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు అంక్షారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,అక్కర్వేణి పోచయ్య, నాయకులు ఒగ్గు దామోదర్,శ్రీనివాస్,కొంకటి రాములు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు బొయిని ప్రశాంత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతానని ఆయన అన్నారు

మరిన్ని వార్తలు