హరీష్ రావు ఉదారత.. రూ. 2 లక్షల ఎల్వోసీ అందజేత
10-11-2026 | 10:12pm
నంగునూరు, (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక స్థోమత లేక హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నంగునూరు మండలం ఖాతా గ్రామానికి చెందిన పుల్లూరు రవికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Former Minister Harish Rao) భరోసానిచ్చారు. బాధితుల పరిస్థితిని సర్పంచ్ పుల్లరీ సోని మహేష్ హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్ళగా.. తక్షణ సహాయంగా హరీష్ రావు రూ. 2 లక్షల ఎల్వోసీ మంజూరు చేశారు. ఈ మేరకు మంజూరు పత్రాలను మంగళవారం బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఆపద సమయంలో తమ కుటుంబానికి ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకున్న హరీష్ రావుకు రవి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.