విద్యార్థిని మృతిపై ప్రభుత్వం సీరియస్..
04-11-2026 | 10:55pm
కేజీబీవీ ఎస్ ఓ సహా, నలుగురిని సస్పెండ్ చేసిన డీఈఓ..
సిద్దిపేట రూరల్, నవంబర్ 4: అక్టోబర్ 29 న సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ కేజీబీవీ(KGBV Raghavapur)లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని దేవులగల్ల లాస్య (15) మృతి చెందిన ఘటనపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. విద్యార్థినికి సకాలంలో వైద్య సహాయం అందించడంలో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హేమలత, ఏఎన్ఎం కవిత, ఇద్దరు టీచర్లు స్వప్న, మంజుల ల కాంట్రాక్టు సేవలను రద్దు చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి సి.రమేశ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు రూరల్ మండలం ఎంఈఓ కొత్త రాజిరెడ్డి తెలిపారు.