బ్లాక్లో భారత్, విండీస్ టీ20 టికెట్లు
- కాంప్లిమెంటరీ పాసులను విక్రయిస్తున్న ముఠా
- నలుగురు నిందితుల అరెస్ట్
- అరెస్టయిన వారిలో హెచ్సీఏ సభ్యుడు
హైదరాబాద్, అక్టోబర్ 13 : భారత్, వెస్టిండీస్(India, West Indies) మధ్య బుధవారం జరిగే టీ20 మ్యాచ్ టికెట్లను(T20 match tickets) బ్లాక్మార్కెట్లో అమ్ము తూ ఒక ముఠా పట్టబడింది. కాంప్లిమెంటరీ పాసులను(Complimentary passes) బ్లాక్ల్ విక్రయిస్తున్న నలుగురు నిందితులను గోషామహల్ పోలీసులు(Goshamahal Police) అరెస్ట్ చేశారు. నాట్ ఫర్ సేల్ అని ముద్రించిన 11 కాంప్లిమెంటరీ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ ద్వారా టికెట్ల విక్రయానికి ప్రచారం చేసినట్టు గుర్తించారు. అరెస్ట యిన వారిలో హెచ్సీఏ సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాత్సవ కూడా ఉండడం సంచ లనంగా మారింది.
వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, ఒక టూవీలర్ స్వాధీనం చేసుకున్నా రు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్టు గోషామహల్ పోలీసులు తెలిపారు. గత నాలుగురోజులుగా ఆన్లైన్లో టికెట్లు దొరకకపోవడంతో అభిమానుల నుంచి హెచ్సీఏపై తీవ్రవిమర్శలు వస్తున్నాయి. హెచ్సీఏ సభ్యులే బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ వచ్చిన ఆరోపణలు తాజాగా నిజమని తేలిందని పలువురు అభిమానులు మండిపడుతున్నారు.