ఎమిరేట్స్ ఈగల్స్ కెప్టెన్‌గా పావెల్

04-11-2026 | 05:10am

అబుదాబి టీ10 లీగ్

అబుదాబి, నవంబర్ 3 : క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్(fastest format of cricket) అబుదాబి టీ10 లీగ్‌లో(Abu Dhabi T10 League) కొత్త జట్టు ఎమిరేట్స్ ఈగల్స్ కెప్టెన్‌గా వెస్టిండీస్ పవర్-హిట్టర్ రోవ్‌మన్ పావెల్(West Indies power-hitter Rovman Powell) ఎంపికయ్యాడు. మావెరిక్ స్పోర్ట్స్ యాజమాన్యంలో ఈ ఫ్రాంచైజీ అబుదాబి టీ10లోకి అడుగుపెట్టింది.మికీ ఆర్థర్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈగల్స్ జట్టులో న్యూజిలాండ్‌ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, భారత మాజీ వికెట్ కీపర్- బ్యాటర్ కోన శ్రీకర్  భరత్, డేవిడ్ వీజ్, నూర్ అహ్మద్, అలెక్స్ హేల్స్, క్రిస్ గ్రీన్, కుశాల్ పెరీరా, హెట్‌మెయిర్ వంటి స్టార్ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు.

ఫ్రాంచైజీ క్రికెట్‌లో తమ ఉనికిని విస్తరించడంలో అబుదాబి టీ10 లీగ్‌ను ప్రధాన అడుగుగా భావిస్తున్నట్టు ఎమిరేట్స్ ఈగల్స్ ఎండీ అన్నం సతీష్ ప్రభాకర్ చెప్పారు. ఎమిరేట్స్ ఈగల్స్‌ను పోటీతత్వంతో, వాణిజ్యపరంగా నిలదొక్కుకోగల ప్రపంచ క్రీడా బ్రాండ్‌గా అభివృద్ధి చేయడమే తమ దీర్ఘకాలిక లక్ష్యమని వెల్లడించారు.  కాగా అబుదాబి టీ10 లీగ్ ఈ నెల 7 నుంచి 20 వరకూ జరగనుంది.

మరిన్ని వార్తలు