ఉత్సాహంగా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్
హైదరాబాద్, నవంబర్ 3 : 7హెచ్ స్పోర్ట్స్(7H Sports) ఆధ్వర్యంలో నిర్వహించిన స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్(Swimming Championship) విజయవంతంగా ముగిసింది. భవిష్యత్తు ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా అండర్ 10, అండర్ 12 విభాగాల్లో పోటీలు జరిగాయి, ఫ్రీస్టుల్, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ ్టస్ట్రోక్, బటర్ ఫ్లు విభాగాల్లో బాలబాలికలు ఉత్సాహంగా పోటీపడ్డారు. ప్రతీ ఈవెంట్‌లో మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచిన బాలురు,బాలికలకు బంగారు,వెండి,కాంస్య పతకాలతో పాటు మెరిట్ సర్టిఫికేట్లను అంద జేశారు.
భవిష్యత్తులో ప్రతిభావంతులైన క్రీడాకారులుగా ఎదిగేందుకు ప్రోత్స హించ డమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని 7హెచ్ స్పోర్ట్స్ ఫౌండర్ వెంకటేష్ చెప్పారు. కెరీర్ ప్రారంభ దశలో ఉన్న స్విమ్మర్లకు ఇలాంటి పోటీలు తమ ప్రతిభను నిరూపించుకునేం దుకు చక్కని వేదికగా ఉపయోగపడతాయ న్నారు. స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ విజయవం తంగా ముగిసేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.