విండీస్ దే నాలుగో టీ ట్వంటీ
* ఉప్పల్ టీ ట్వంటీలో టీమిండియాకు షాక్ తగిలింది. హై స్కోరింగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ షై హోప్ మరోసారి సెంచరీతో చెలరేగాడు. తర్వాత బౌలింగ్‌లోనూ విండీస్ సత్తా చాటింది. కీమో పాల్ దెబ్బకు భారత్ బ్యాటింగ్ లైనప్ చేతులెత్తేసింది. చివర్లో తిలక్ వర్మ, నితీష్ రెడ్డి పోరాడినా ఫలితం లేకపోయింది.
- ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన భారత్
- సెంచరీతో రెచ్చిపోయిన హోప్
- చేజింగ్ లో మిడిలార్డర్ వైఫల్యం
- 2-2తో సిరీస్ సమం
హైదరాబాద్, అక్టోబర్ 14 : టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్(India fielding) ఎంచుకుంది. తుది జట్టు లో ఎలాంటి మార్పులు చేయలేదు. బ్యాటిం గ్ పిచ్ కావడంతో వెస్టిండీస్ బ్యాటర్లు(West Indies batters) దూకుడుగా ఆడారు.తొలి 6 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 79 పరుగులు రాబట్టి భారత్‌పే సరికొత్త పవర్‌ప్లే రికార్డును నెలకొల్పారు. షిమ్రాన్ హ్టుమైర్తి కలిసి షై హోప్ చెలరేగాడు. వెస్టిండీస్ 7.4 ఓవర్లలోనే 100 పరుగులు చేసిం ది. దూకుడుగా ఆడిన షిమ్రాన్ హ్టుమైర్(Shimron Hetmyer)(33)ను ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.
హ్టుమైర్ వెనుదిరిగి నా.. పోవెల్‌తో కలిసి షై హోప్ చెలరేగాడు. ఈ క్రమంలో అతను 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోవ్‌మన్ పోవెల్(24)ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేసినా.. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌తో కలిసి షై హోప్ విధ్వం సం సృష్టించాడు. రూథర్‌ఫోర్డ్ కూడా బ్యాట్ ఝులిపించడంతో 16.4 ఓవర్లలోనే వెస్టిండీస్ 200 పరుగుల మార్క్ అందుకుంది.42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో రూథర్‌ఫోర్డ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మయాంక్ యాదవ్ నేలపాలు చేశా డు.
నితీష్ కుమార్ రెడ్డి వేసిన ఇన్నింగ్స్ ఆ ఖరి బంతిని షై హోప్ సిక్స్ బాది 50 బంతుల్లో సెంచరీ పూర్తి చే సుకున్నాడు.ఈ సిరీస్‌లో షై హోప్‌కు ఇది రెండో శతకం. కేవలం 50 బంతు ల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 102 పరుగులు* చేసి అజే య సెంచరీతో జట్టు కు భారీ స్కోరు అందించాడు.నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగుల చేసింది.భారత బౌలర్లలో అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌లు తలొక వికెట్ పడగొట్టినప్పటికీ పరుగులను మాత్రం అడ్డుకో లేకపోయారు.
వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల భారీ లక్ష్య ఛేద నలో భారత్ దూకుడుగా ఆడుతూనే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లో తు కష్టాల్లో పడింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభి షేక్ శర్మ మరోసారి మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు 60 పరుగులు జోడించారు. సంజూవిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవ లం 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సా యంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (29), ఇషాన్ కిషన్ (6), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
భారత్ 15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, నమన్ ధీర్ వరుసగా గుడకేష్ మోతీ బౌలింగ్‌లో అవుట్ కావడంతో భారత్ కొంత ఒత్తిడిలో పడింది. ఈ దశలో తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ధాటిగా ఆడి ఆశలు రేకెత్తించారు. తిలక్ వర్మ (25 బంతుల్లో 43 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్సర్లు) నితీష్ కుమార్ రెడ్డి (20 బంతుల్లో 41 పరుగులు(1 ఫోర్, 4 సిక్సర్లు) వేగంగా ఆడి మ్యాచ్‌ను ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా ఉంచారు. విండీస్ బౌలర్ కీమో పాల్ 5 వికెట్లతో భార త బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. గుడాకేష్ మోటీ కూడా 2 వికెట్లు పడగొట్టాడు.
స్కోర్‌బోర్డు
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 247/3 ( హోప్ 102 నాటౌట్, రూథర్ ఫర్డ్ 49 నాటౌట్, హెట్ మెయిర్ 33; అర్షదీప్ సింగ్ 1/52, ప్రిన్స్ యాదవ్ 1/36 )
భారత్ ఇన్నింగ్స్: 223 (సంజూ శాం సన్ 56, తిలక్ వర్మ 43, నితీష్ రెడ్డి 41 ; కీమో పాల్ 5/41, మోతి 2/13)