శివచరణ్ రెడ్డిని కలిసిన డివిజన్ ల అధ్యక్షులు

17-11-2026 | 10:31pm

ఘట్ కేసర్, నవంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి(State president Jakkidi Shivacharan Reddy)ని మంగళవారం ఘట్ కేసర్ సర్కిల్ డివిజన్ ల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిశారు.

పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాగుల వినోద్ కుమార్, ఎదులాబాద్ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా చిలుకూరి నిఖిల్ నియమితులైన సందర్భంగా మేడ్చల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర రాహుల్ ఆధ్వర్యంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా తనపై ఎంతో నమ్మకం ఉంచి పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, యువతను పార్టీ వైపు మరింతగా ఆకర్షిస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని వినోద్ కుమార్ తెలియజేశారు.

మరిన్ని వార్తలు