రోడ్డు వేశారు.. మట్టి మరిచారు.!

04-11-2026 | 05:20am
  1. కోదాడ ఖమ్మం క్రాస్‌రోడ్డు నుంచి మేళ్లచెరువు రోడ్డుకు కొత్త తారు రోడ్డు
  2.    20 రోజులైనా మార్జిన్లకు మట్టి పోయాను వైనం
  3. ప్రమాదకరంగా మారిన ప్రయాణం                                    
  4. రహదారి అంచులకు కోత పడే అవకాశం
  5. మలుపు వద్ద హెచ్చరిక బోర్డు కరువు..       
  6. సమస్యను పరిష్కరించాలని వేడుకోలు

కోదాడ, నవంబర్ 3: రోడ్డు నిర్మాణం(Road construction) పూర్తయితే సరిపోతుందా, వాహనదారుల భద్రతను గాలికొదిలేయడమేనా, నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులు నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అనే ప్రశ్నలు బా గానే వినిపిస్తున్నాయి. కోదాడ- ఖమ్మం క్రాస్ రోడ్(Kodad-Khammam Crossroad) నుంచి మేళ్లచెరువు రోడ్డు వైపు కొత్తగా నిర్మించిన తారు రహదారిపై నెలకొన్న పరిస్థితులు ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రోడ్డు నిర్మాణం పూర్తయి 20 రోజులు గడుస్తున్నా కనీస భద్రతా చర్యలు చేపట్టకపో వడం విమర్శలకు తావిస్తోంది.

 మార్జిన్లకు మట్టి ఏదీ.? 

కొత్తగా తారు రోడ్డు వేసిన తర్వాత రహదారి అంచులకు మట్టి లేదా గ్రావెల్ నింపి రోడ్డు స్థాయికి సమానం చేయాల్సి ఉంటుం ది. అయితే ఇక్కడ మార్జిన్లకు మట్టి వేయకపోవడంతో రోడ్డు అంచులు కోతకు గురవు తున్నాయనీ స్థానికులు చెబుతున్నారు. అలా ఉంచడం వల్ల వాహనాలు రోడ్డు పక్కకు దిగినప్పుడు అదుపు తప్పే ప్ర మాదం ఉంది. రహదారి పక్కన పేరుకుపోయిన మట్టిని తొలగించకపోవడంతో దు మ్ము, ధూళి వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ప్రమాదకరంగా మూలమలుపులు 

ఈ రోడ్డులో ఉన్న మూలమలుపులు ప్ర మాదకరంగా ఉన్నాయి. మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదా రుల అభిప్రాయపడుతున్నారు. కొత్త రహదారిపై ప్రయాణించే వాహనదారులకు మ లుపు గురించి ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ట్లు చెబుతున్నారు. రహదారిపై అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, వేగ పరిమితి సూచికలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు అంటున్నారు.

మార్కింగ్స్ లేక రాత్రివేళ ఇబ్బందులు

కొత్త రహదారిపై అంచులను సూచించే తెల్లటి గీతలు, మధ్య రేఖలు వంటి రోడ్ మా ర్కింగ్స్ వాహనదారులకు దారి చూపుతా యి. ముఖ్యంగా రాత్రివేళ రిఫ్లెక్టివ్ మా ర్కింగ్స్ భద్రతకు ఎంతో అవసరం. రహదారిపై అవసరమైన మార్కింగ్స్, హెచ్చరిక సూ చికలు లేకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.

రోడ్డు వేసి.. భద్రత మరచి..! 

రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రహదారి భద్రత, నిర్వహణకు సంబంధించిన చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. రోడ్డు పక్కన మట్టి నింపడం, పేరుకుపోయిన మట్టిని తొలగించడం, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్స్ ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టాలి. రోడ్డు ఉపరితలంపై మిగిలిపోయిన వదులైన కంకరను తొలగించడం కూడా అవసరం.అయితే ఇక్కడ రోడ్డు నిర్మాణం పూర్తయి 20 రోజులు గడుస్తున్నా ఈ పనులు చేపట్టకపోవడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 ఇలా చేస్తే సరి: 

కొత్త రహదారిపై భద్రతా చర్యలు చేపట్టకపోవడం వాహనదారులకు ప్రమాదకరం గా మారుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మార్జిన్లకు మట్టి నింపడంతో పాటు పేరుకుపోయిన మట్టిని తొలగించాలి. మలుపు వద్ద హెచ్చరిక బోర్డు, అవసరమైన రోడ్ మార్కింగ్స్ ఏర్పాటు చేసి వాహనదారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్డు మార్జిన్‌లలో మట్టి పోయాలి 

రోడ్డుకు ఇరువైపులా మార్జిన్ కు మట్టి పోయకపోవడంతో ప్రయాణంలో వాహనదారులు రోడ్డు దిగాలంటే ఇబ్బందికరంగా మారింది. కాబట్టి వెంటనే మార్జిన్లలో మట్టి పోయించి ఇబ్బంది తొలగించాలి. అలాగే మూలమలుపుల వద్ద ప్రమాద సూచిక బోర్డులు, డివైడర్లు ఏర్పాటుచేయాలి. ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకముందే అధికారులు అన్నీ ఏర్పాటు చేయడం మంచిది.         

బషీరుద్దీన్, 

సామాజిక కార్యకర్త, కోదాడ

మరిన్ని వార్తలు