వైభవంగా ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

09-11-2026 | 08:01pm

చివ్వెంల, నవంబర్ 9 (విజయక్రాంతి): చివ్వెంల మండల పరిధిలోని(Chivvemla Mandal) ఉండ్రుగొండ గిరిదుర్గంపై కొలువై ఉన్న శ్రీ ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఆశ్వీయుజ మాస స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

శ్రీమాన్ ఆరుట్ల రవికుమారాచార్యులు, శ్రీమాన్ ద్రోణాచార్యులు, ఆలయ అర్చకులు కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు.

మరిన్ని వార్తలు