మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు

09-11-2026 | 07:53pm

ఘట్ కేసర్, నవంబర్ 9 (విజయక్రాంతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Enumula Revanth Reddy), టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud)  ఆదేశానుసారం ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని ఘనపురం, పకీర్ టేక్యతండ, లింగాపురం గ్రామాలలో ఆదివారం రాత్రి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్  ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Houses) పూర్తయిన లబ్ధిదారులు(Beneficiaries) వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య  ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

ఈ సందర్బంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ దీపావళి పండుగ నా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా, ఎప్పటికీ చెరిగిపోని అనుభూతిగా నిలిచిపోతుందన్నారు. దశాబ్దాలుగా సొంతింటి కోసం ఎదురుచూస్తూ, ఎన్నో కష్టాలను భరిస్తూ కాలం వెళ్లదీసిన నిరుపేద కుటుంబాల కల నిజమైన వేళ చీకట్లను చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగ రోజున పేద కుటుంబాల జీవితాల్లో సొంతింటి వెలుగులు నిండిన అపురూపమైన సందర్భమని, ఆ కొత్త ఇంటిలో విరిసిన చిరునవ్వులు, ఆడబిడ్డల ఆప్యాయతలు, వారి కళ్లలో కనిపించిన ఆనందం, ఆత్మీయత, ఆనందభాష్పాలతో తడిసిన కళ్లు, ఆనందంతో నిండిన వారి మాటలు, ఎప్పటికీ మరిచిపోలేనిని అన్నారు.

అనంతరం ఘనపురం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలలో పాల్గొని నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి, జన్మదిన వేడుకలు జరిపి జరుపుకుని ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమాలలో ఘనపురం గ్రామ మాజీ సర్పంచ్ లు  ననావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వేముల పరమేష్ గౌడ్, డివిజన్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల శంకర్ గౌడ్, డివిజన్ కార్యదర్శి తాటికొండ మల్లేష్ గౌడ్, ఘణపురం గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేముల రాజు గౌడ్, ఇందిరమ్మ కమిటి సభ్యులు గుర్జకుంట నర్సింహా, బర్ల అనీత,   యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు