కుటుంబ కలహాలతో వృద్ధుడు ఆత్మ హత్య
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) తాండూరు మండలంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఒకరికి మరణానికి దారితీశాయి. గొడవలతో మనస్థాపం చెందినా ఇడిదినేని నాగయ్య (55) పురుగుల మందు తాగి ఆత్మహత్య(Suicide) చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకున్నది. తాండూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇడిదీనేని నాగయ్య(Ididineni Nagayya), భార్య పద్మ మధ్య ఆస్తుల కోసం తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఇద్దరూ తెల్లవారు జామునా గొడవ పడ్డారు. ఈ ఘటనలో పద్మకు గాయాలయ్యాయి. భార్య ప్రవర్తనకు మనస్థాపం చెందిన నాగయ్య ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ కి సమాచారమిచ్చి, బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు నాగయ్య అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. తండ్రి మరణంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని కుమార్తె రమాదేవి పోలీసులకు పిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.