బాలసదన్ చిన్నారులతో దీపావళి జరుపుకున్న సీపీ
కొండపాక, నవంబర్ 9 (విజయక్రాంతి): కొండపాక మండల(Kondapaka Mandal) కేంద్రంలోని నిశాంత్ ఆనంద బాలసదన్‌ను(Nishanth Ananda Balasadan) సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్(Siddipet Police Commissioner Rashmi Perumal) ఐపీఎస్ ఆదివారం సందర్శించి చిన్నారులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు మిఠాయిలు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారుల సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బాలసదన్ నిర్వాహకులు, ఇన్స్పెక్టర్ లతీఫ్, తోగుట సీఐ శ్రీను, కుకునూరుపల్లి ఎస్ఐ బాలకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.