దండారి వేడుకల్లో సోయం బాపురావు సందడి

09-11-2026 | 07:43pm

తలమడుగు నవంబర్ 9(విజయక్రాంతి): తలమడుగు మండలంలోని(Talamadugu Mandal) నడింపల్లి గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో మాజీ ఎంపీ సోయం బాపురావు(Former MP Soyam Bapurao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్‌తో కలిసి ఆదివాసీల సంప్రదాయ నృత్యాలైన గుస్సాడి నృత్యాల్లో పాల్గొన్నారు. కళాకారులతో కలిసి అడుగులు వేస్తూ  గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ(Congress Party) దండారి ఉత్సవాలకు 15 వేలు ఇస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి,బాబన్న,ప్రకాశ్ రావు,ప్రతాప్, వెంకటి,ప్రవీణ్, సాంబశివ్, రాకేష్,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు