పెద్దగట్టును శాశ్వత పనులతో అభివృద్ధి చేయాలి

09-11-2026 | 08:03pm

సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించి ప్రత్యేక నిధులు కేటాయించాలి

యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు కలకండ్ల సాదయ్య యాదవ్

చివ్వెంల, నవంబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన సూర్యాపేట జిల్లా(Suryapet District) దురాజ్‌పల్లి పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతరను(Peddagattu Srilimgamuntula Swamy Jatara) శాశ్వత అభివృద్ధి పనులతో(development works) తీర్చిదిద్దాలని యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు కలకండ్ల సాదయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్‌పల్లి వద్ద గల శ్రీలింగమంతుల స్వామి ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రతి రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా నిర్వహించే పెద్దగట్టు జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. జాతర సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

మరిన్ని వార్తలు