హక్కుల కోసం పోరాడితే అరెస్టులా..?
* కొడంగల్ ధర్నాకు వెళ్తున్న ముగ్గురు వికలాంగుల అరెస్టుపై హక్కుల పరిరక్షణ సమితి ఖండన
* వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి.. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి
గరిడేపల్లి, నవంబర్ 9 (విజయక్రాంతి) : వికలాంగుల హక్కుల సాధన(Achieving the Rights of Persons with Disabilities) కోసం పోరాడితే అరెస్టులు చేస్తారా..? అని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు ప్రశ్నించారు. వికలాంగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం కొడంగల్‌లో(Kodangal) నిర్వహించనున్న ధర్నాకు వెళ్తున్న ముగ్గురు వికలాంగులను గరిడేపల్లి పోలీసులు అరెస్టు(Arrest by Garidepalli police) చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు.
వికలాంగులకు నెలకు రూ.6 వేల పింఛను ఇవ్వాలని, అర్హులందరికీ ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఇళ్లు లేని వికలాంగులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. స్వయం ఉపాధి కోసం పూచీకత్తు లేని రుణాలు అందించడంతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.
వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వికలాంగుల సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు వారి ఆందోళనలను అడ్డుకోవడం సరికాదని విమర్శించారు. అరెస్టు చేసిన ముగ్గురు వికలాంగులను వెంటనే విడుదల చేయడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా నాయకులు గుర్రం నరేష్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, భిక్షం కోరారు.