నాగుల చవితి అంటే పాములకు పూజలు చేసే పండుగ కాదు

15-11-2026 | 06:21pm

కోదాడ నవంబర్ 15 (విజయక్రాంతి): నాగుల చవితి అంటే పాములకు పూజలు చేసే పండుగ కాదని  ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని నయానగర్‌లో మదర్ ధెరిస్సా స్కూల్(Mother Teresa School) బజారులో త్రైత సిద్ధాంత భగవద్గీత, అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథాలను ఇంటింటికి తిరిగి పరిచయం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లోపతి వైద్యం లేని రోజుల్లో మన పూర్వీకులు పాము కాటుకు గురైన వ్యక్తిని వేప ఆకులు తనిపించి, చేదు లేదని బాధిత వ్యక్తి చెబితే విషం తలకెక్కిందని గ్రహించి, రావి ఆకులను తీసుకొచ్చి రావి ఆకు కాడలను చెవిలో ఉంచేవారని, రావి ఆకులకు విషాన్ని గ్రహించుకునే లక్షణం ఉందన్నారు.

రావి ఆకులతో మనిషి నుంచి పాము విషాన్ని తొలగించి ప్రాణాలను రక్షించేవారన్నారు. ప్రతి ఊర్లో రావి చెట్టు, వేప చెట్టు ఒకే దగ్గర నాటడంతో పాటు ఆ చెట్ల కింద నాగు పాము బొమ్మలను ఉంచి నాగులకట్ట అని పిలిచేవారన్నారు. నాగుల చవితి రోజు ప్రజలను నాగులకట్ట వద్దకు పిలిచి పాము విషానికి విరుగుడు వైద్యం వివరించేవారని, కాలక్రమంలో ప్రకృతిసిద్ధమైన మూలికవైద్యం అంతరించిందన్నారు. ప్రస్తుతం నాగుల చవితి అంటే పాములకు పూజలు చేసే పండుగలా మారిందన్నారు. ఈ ప్రచారంలో ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు