రైతులకు మరింత చేరువగా సేవలు

19-11-2026 | 10:35pm

గోపతండలో రైతు సేవా కేంద్రం ప్రారంభం

ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ భూక్య బిక్కు నాయక్

 మోతె,(విజయ క్రాంతి): రైతులకు అవసరమైన సేవలను మరింత చేరువ చేసేందుకు సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని గోపతండ గ్రామం(Gopathanda Village)లో నూతనంగా ఏర్పాటు చేసిన నాగు రైతు సేవా కేంద్రాన్ని(Nagu Rythu Seva Kendra) గురువారం ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భూక్య బిక్కు నాయక్(Sarpanch Bhukya Bikku Naik) ముఖ్య అతిథిగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఈ రైతు సేవా కేంద్రం రైతులకు ఎంతగానో ఉపయోగపడాలని, వ్యవసాయ రంగానికి తోడ్పాటునందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీరాములు, ఉపసర్పంచ్ ఈశ్వరి రవి, మాజీ ఉపసర్పంచ్ సర్వన్, గుగులోతు భగవాన్ రామోజీ, భూక్య సాగర్, గుగులోతు వినోద్,  పెరుగు రమేష్, గుగులోతు లింగ, లాలు, రామన్న, కొర్ర నరేందర్, కొర్ర శివ, గుగులోతు మంగ్యా, భూక్య నరేష్, కావేటి రవి, గుగులోతు రంగా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు