పండుగల సాయన్న విగ్రహ ఏర్పాటులో రాజకీయం.!

19-11-2026 | 10:20pm

ఒకే ఉరిలో ఒకే ప్రాంతంలో రెండు విగ్రహాలు

కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య పోటాపోటీ

పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నాయకుల ఆందోళన

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): కొల్లాపూర్ నియోజకవర్గం కల్వకోల్ గ్రామం(Kalvakol Village)లో పండుగల సాయన్న విగ్రహాల(Pandugala Sayanna Idol) ఏర్పాటుపై రాజకీయ వివాదం నెలకొంది. ఈ నెల 21న మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకే ఉరిలో ఒకే ప్రాంతంలో వేర్వేరుగా రెండు విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, బీజేపీ(BJP) నాయకులు మరో విగ్రహాన్ని దిమ్మెపై ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి రాస్తారోకోకు సిద్ధమయ్యారు.

తమ నాయకులను ఎందుకు అడ్డుకుంటున్నారో పోలీసులు సమాధానం చెప్పాలని బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ(Kollapur constituency) ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు డిమాండ్ చేశారు. అనంతరం బీజేపీ నాయకులు తమ విగ్రహాన్ని దిమ్మెపై ఏర్పాటు చేశారు. ఈ నెల 21న జరిగే జయంతి వేడుకల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చేతుల మీదుగా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు కూడా వేర్వేరుగా విగ్రహావిష్కరణకు సిద్ధమవుతున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గువ్వలి వెంకటయ్య, దేశమోని పరుశురాం, అమ్మపల్లి మల్లేష్, గడ్డమీది రాముడు, జింకల గోపాల్, చంద్రశేఖర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు