అర్హుల చెంతకు చేయూత పింఛన్లు

19-11-2026 | 10:23pm

నూతన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ మొక్క వెంకటేశ్వర్లు

మోతె,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్లను(Cheyutha Pensions) సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని ఉర్లుగొండ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ మొక్క వెంకటేశ్వర్లు(Sarpanch Mokka Venkateshwarlu) అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న పింఛన్లు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు తదితర వర్గాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శరత్ కుమార్, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, పెద్దలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు