మురసు తుపానుతో నష్టపోయిన పొలాలను పరిశీలించిన అధికారులు

10-11-2026 | 10:28pm

కోదాడ నవంబర్ 10 (విజయక్రాంతి): మురసు తుపాను(Murasu Cyclone)తో నష్టపోయిన పొలాలను కోదాడ వ్యవసాయ విస్తరణ అధికారి నిమ్మ పిచ్చయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్యం పాపిరెడ్డి మంగళవారం పరిశీలించారు. మురసు తుఫానుకు గుడిబండ, రామలక్ష్మి పురం గ్రామాల్లో పడిపోయిన పోలాలను పరిశీలించడం జరిగింది.

ఎకరాకు పది బస్తాల దిగుబడి కూడా రావడం కష్టంగా ఉన్నదని ఉన్న గింజలు కూడా తాలుగింజలుగా మారి వాటి నీర్పుడికి కోత మిషన్ కు నాలుగు గంటల సమయం పడుతుంది రైతుల కష్టాల నష్టాలను ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ అధికారుల ద్వారా నష్టాన్ని అంచనా వేయమని కోరడం రైతులకు ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తారని నమ్మకంతో రైతులను ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు