జపాన్ విద్యావిధానంపై అధ్యయనానికి గుర్తింపు

09-11-2026 | 07:01pm

సీఎం ముఖాముఖికి రాజశేఖర్‌కు ఆహ్వానం

* ఈనెల 14న సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేక సమావేశం

• జపాన్ విద్యావిధానంలో ఉత్తమ బోధనా పద్ధతులపై అభిప్రాయాల వెల్లడి

గరిడేపల్లి, నవంబర్ 9 (విజయక్రాంతి) : జపాన్ విద్యావిధానంపై అధ్యయనం చేసి వచ్చిన గరిడేపల్లి మండలం(Garidepally Mandal) రంగాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు(Teacher at Rangapuram Primary School), సైకాలజిస్ట్ చారుగుండ్ల రాజశేఖర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(Revanth Reddy) నిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. తెలంగాణ విద్యాశాఖ(Telangana Education Department) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు జపాన్‌లో పర్యటించిన ఉపాధ్యాయ బృందంలో రాజశేఖర్‌ కూడా సభ్యుడిగా ఉన్నారు.

ఈ సందర్భంగా అక్కడి విద్యాసంస్థలను సందర్శించి బోధనా పద్ధతులు, విద్యార్థుల క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్య తదితర అంశాలపై అధ్యయనం చేశారు.జపాన్ పర్యటనలో పొందిన అనుభవాలు, అక్కడి విద్యావిధానంలోని ఉత్తమ పద్ధతులు, వాటిని తెలంగాణ విద్యావ్యవస్థలో అమలు చేసేందుకు ఉన్న అవకాశాలపై సీఎం రేవంత్‌రెడ్డితో తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.

ఈనెల 14న తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేష్ ప్రకటించారు.మండలంలోని మారుమూల గ్రామమైన రంగాపురం పాఠశాలలో పనిచేస్తున్న రాజశేఖర్‌ తన బోధనా విధానాలతో పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.

ఆయనకు ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం పట్ల స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్, అవొపా, విజయీభవ ట్రస్ట్, ఆర్యవైశ్య సంఘం, వర్తక సంఘం నాయకులతో పాటు యూటీఎఫ్, పీఆర్టీయూ, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు