క్రిస్మస్ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
క్రిస్టియన్ మాజీ కోఆప్షన్ సభ్యురాలు వంటపాక జానకి యేసయ్య
కోదాడ నవంబర్ 28(విజయక్రాంతి) : క్రిస్మస్ వేడుకలను(Christmas celebrations) ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 30 వేల చొప్పున ఆర్థిక సాయం(Financial assistance) అందిస్తోందని క్రిస్టియన్ మాజీ కోఆప్షన్ సభ్యురాలు వంటపాక జానకి యేసయ్య శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రిస్మస్ కోసం చర్చిలను రంగులు, విద్యుత్ దీపాలతో(Electric lights) అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో(devotional) వేడుకలు జరుపుకునేందుకు సంబంధిత కార్పొరేషన్ ద్వారా ఈ నిధులు మంజూరు అవుతాయని పేర్కొన్నారు.
ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు కోదాడ పట్టణంలోని అర్హులైన చర్చిల పాస్టర్లు, సంఘ పెద్దలు ఈ నెల 30వ తేదీ లోపు అవసరమైన వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రతి చర్చిలో క్రిస్మస్ పండుగను ఆనందంగా, ఐక్యతతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.