ఎమ్మెల్యే జన్మదినం... విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

28-11-2026 | 08:01pm

గండీడ్,(విజయక్రాంతి): పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,పీఏసీఎస్ డైరెక్టర్ ఆర్.శ్రీనివాస్ రెడ్డి,గ్రామ సర్పంచ్ భగవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలోని 200 మంది విద్యార్థినులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థుల సమక్షంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గుముడాల చెన్నయ్య,వార్డు సభ్యులు చంద్రయ్య,బాబ్జి, మల్కయ్య,హస్నాబాద్ వెంకటయ్య,కోస్గి వెంకటేష్, పాఠశాల విద్యార్థులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు